Page Loader
భగవంత్ కేసరి ప్రమోషన్ పనులు మొదలు: మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ 
సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి మొదటి పాట

భగవంత్ కేసరి ప్రమోషన్ పనులు మొదలు: మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 29, 2023
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా నుండి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. భగవంత్ కేసరి మొదటి పాటను సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది. అంతకంటే ముందుగా ఆగస్టు 30వ తేదీన సాయంత్రం 4:05గంటలకు మొదటి పాట ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. గణపతి పాటగా (గణేష్ ఆంథెమ్) రాబోతున్న ఈ పాటలో బాలకృష్ణ, శ్రీలీల కలిసి స్టెప్పులు వేయబోతున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా, దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన థియేటర్లలోకి విడుదలవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్