Page Loader
Bharateeyudu Re-Release: మళ్ళీ విడుదలకు సిద్దమవుతున్న భారతీయుడు.. నేడు ట్రైలర్‌ విడుదల!
మళ్ళీ విడుదలకు సిద్దమవుతున్న భారతీయుడు.. నేడు ట్రైలర్‌ విడుదల!

Bharateeyudu Re-Release: మళ్ళీ విడుదలకు సిద్దమవుతున్న భారతీయుడు.. నేడు ట్రైలర్‌ విడుదల!

వ్రాసిన వారు Stalin
May 27, 2024
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ డ్యుయల్ రోల్‍లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ సినిమా ఐకానిక్‍గా నిలిచింది. 1996లో విడుదలైన ఈ దేశభక్తి యాక్షన్ మూవీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. భారతీయుడు పేరుతో తెలుగులోనూ రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. తమిళంలో రికార్డులు సృష్టించింది. 28 ఏళ్ల తర్వాత ఇండియన్ (భారతీయుడు) సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ఇండియన్ 2 చిత్రం ఈ ఏడాది జూలై 12న రిలీజ్ కానుంది. అయితే, అంతకంటే ముందు ఇండియన్-1 చిత్రం మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. 28ఏళ్ల తర్వాత ఈ మూవీ మళ్లీ రీ-రిలీజ్ అవుతోంది.

Details 

రీ-రిలీజ్ డేట్ ఇదే.. 

భారతీయుడు(ఇండియన్)సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. తమిళంలోనూ మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ నిన్న(మే 26) వెల్లడించింది. "బ్లాక్‍బస్టర్ ఎక్స్‌పీరియన్స్ మరోసారి పొందండి. తెలుగు, తమిళంలో జూన్ 7న భారతీయుడు-1 రీ-రిలీజ్ కానుంది"అని ట్వీట్ చేసింది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారత స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పాత్రతో పాటు అతడి కుమారుడు,అవినీతి అధికారి అయిన చంద్రు క్యారెక్టర్‌ను కూడా భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ పోషించారు. ఈ రెండు పాత్రల్లోనూ జీవించేశారు.అవినీతి అధికారుల అంతు చూసే సేనాపతి క్యారెక్టర్ ఐకానిక్ కల్ట్ పాత్రగా నిలిచింది. ముఖ్యంగా పాటల చిత్రీకరణకు భారీగా వ్యయం చేశారు.విదేశాలతో సహా భారత్ లో జరిపిన చిత్రీకరణ హైలైట్ అని చెప్పాలి.

Details 

భారతీయుడు బ్లాక్‍బస్టర్

ఆస్ట్రేలియన్ కంగారులు కనిపించే పాటకు అప్పట్లో చిన్నారులు కేరింతలు కొట్టారు. 1996 మే 9వ తేదీన భారతీయుడు రిలీజై బ్లాక్‍బస్టర్ అయింది. శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రశంసలను పొందింది. దేశభక్తి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఈ మూవీలో ఆకట్టుకున్నాయి. ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం కూడా ఆ మూవీకి మరో హైలైట్‍గా నిలిచింది. భారతీయుడు చిత్రంలో కమల్‍హాసన్‍తో పాటు మనీషా కొయిరాలా, ఊర్మిలా మతోంద్కర్, సుకన్య, మనోరమ, సెంథిల్, కస్తూరి కీలకపాత్రలు పోషించారు. శ్రీసూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు.