
Manoj Bharathiraja: ప్రముఖ దర్శకుడు,నటుడు ఇంట పెను విషాదం..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతిరాజా (Bharathiraja) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతిరాజా (48) కన్నుమూశారు. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటనతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదచాయలు అలముకున్నాయి.
కొన్ని రోజుల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్న మనోజ్ చెట్‌పేట్‌లోని తన నివాసంలో కోలుకుంటుండగా, ఈ రోజు సాయంత్రం ఆకస్మికంగా మరోసారి గుండెపోటు వచ్చింది.
వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించి మరణించారు.
ఆయన అకాల మరణంతో భారతిరాజా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
వివరాలు
తాజ్‌మహల్ చిత్రంతో మనోజ్ సినీ రంగ ప్రవేశం
పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తండ్రి భారతిరాజా దర్శకత్వంలో 1999లో విడుదలైన తాజ్‌మహల్ చిత్రంతో మనోజ్ సినీ రంగ ప్రవేశం చేశారు.
తన కెరీర్‌లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆయన సముద్రమ్, కాదల్ పుక్కల్, వరుషమెల్లం వసంతం, ఈరనీలం వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.