భోళాశంకర్ నిర్మాతలకు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన చిరంజీవి?
మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా విడుదలైన భోళాశంకర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం, ఇప్పటి ప్రేక్షకులను ఆకర్షించలేదు. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాకు తీవ్రనష్టాలు వచ్చాయి. అయితే నిర్మాతల నష్టాలను పూడ్చడానికి చిరంజీవి, తన రెమ్యునరేషన్ లోని పదికోట్లను వెనక్కి ఇచ్చేసారని సమాచారం. నిజానికి ఈ చిత్రానికి చిరంజీవి 65కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నారట. అందులోంచి ప్రస్తుతం 10కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చేసారని అంటున్నారు. ఈ విషయంపై అధికారిక సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భోళాశంకర్ పై మొదటి నుండి నెగెటివిటీ
భోళాశంకర్ సినిమాను ప్రకటించినప్పటి నుండి నెగెటివిటీ ఏర్పడింది. 2015లో విడుదలైన వేదాళం సినిమా రీమేక్ సరికాదని నెటిజన్లు అప్పట్లో కామెంట్స్ చేసారు. ఇక భోళాశంకర్ సినిమాను మెహెర్ రమేష్ కి అప్పగించడం చాలామంది అభిమానులకు రుచించలేదు. టీజర్ విడుదల తర్వాత కూడా నెగెటివిటీ కంటిన్యూ అయ్యింది. ట్రైలర్ తో నెగెటివిటీ కొద్దిగా దూరమైంది. కానీ సినిమా విడుదల తర్వాత భోళాశంకర్ అభిమానులను పూర్తిగా నిరాశ పరిచింది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించింది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లులుగా నటించింది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు.