NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా?
    సినిమా

    భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా?

    భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా?
    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 20, 2023, 02:43 pm 0 నిమి చదవండి
    భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా?
    చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం

    ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య విజయం అందుకుని కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఆచార్య, గాడ్ ఫాదర్ మిగిల్చిన నిరాశను పక్కకు నెట్టి వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకుంది.. విమర్శకుల నుండి మొదటిరోజు వచ్చిన ప్రతికూల స్పందన ఈ సినిమా మీద పెద్దగా పనిచేయలేదు. మాస్ సినిమాను చూసే దృష్టికోణం ప్రజల్లో మారిందనీ, విమర్శకుల్లో మార్పు రావాలని, లేదంటే విమర్శలను పట్టించుకునే అవకాశం ఉండదని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఏది ఎలా ఉన్నా వాల్తేరు వీరయ్య మాత్రం ఆగట్లేదు. దూసుకుపోతూనే ఉన్నాడు. ఐతే ఈ సినిమా తర్వాత చిరంజీవి నుండి భోళాశంకర్ అనే చిత్రం వస్తోంది.

    రిలీజ్ ని వాయిదా వేసే పనిలో భోళాశంకర్ చిత్రబృందం

    మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. నిజానికి ఈ పాటికి పూర్తి కావాల్సింది. కానీ ఇంకా చిత్రీకరణ జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. అది పూర్తి కావాలంటే చాలా టైమ్ పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో భోళాశంకర్ చిత్రం అనుకున్న తేదీకి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. 14 ఏప్రిల్ 2023 రోజున సినిమాను రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. కానీ ఆలోపు షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాలంటే కష్టమని వినిపిస్తోంది. అందుకే నెలరోజులు వాయిదా వేసుకుని మే నెలలో సినిమాని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    చిరంజీవి
    తెలుగు సినిమా
    వాల్తేరు వీరయ్య

    తాజా

    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్
    జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు కేశ సంరక్షణ

    చిరంజీవి

    చిరంజీవి భోళాశంకర్ సినిమాలో లవర్ బాయ్ గా సుశాంత్ తెలుగు సినిమా
    పొన్నంబాలం: సొంత కుటుంబమే విషమిచ్చి చంపాలని చూసింది సినిమా
    రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. గర్వపడ్డ చిరంజీవి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్ సినిమా

    తెలుగు సినిమా

    మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ఇష్క్ సినిమా సినిమా రిలీజ్
    రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ సినిమా
    ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు సినిమా
    #VNRtrio: నితిన్ సినిమాకు చిరంజీవి క్లాప్, వెంకీతో సినిమా ఉన్నట్టేనా? సినిమా

    వాల్తేరు వీరయ్య

    సంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు ఓటిటి
    మెగాస్టార్ నెక్స్ట్: చిరంజీవి చేసిన మార్పులకు ఒప్పుకున్న యంగ్ డైరెక్టర్? చిరంజీవి
    బాలయ్య 125 దాటేసాడు, చిరంజీవి 200 చేరుకోబోతున్నాడు వీరసింహారెడ్డి
    వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు తెలుగు సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023