Bhola shankar: 'జామ్ జామ్ జజ్జనకా' సాంగ్ ప్రోమో విడుదల; మెగాస్టార్ ఆట అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలోని 'జామ్ జామ్ జజ్జనకా తెల్లార్లు ఆడుదాం తైతక్క' అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది.
దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ పూర్తి పాటను జూలై 11న విడుదల చేయనున్నారు.
ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ ఆకట్టుకుంది. అక్కినేని శుశాంత్, కీర్తి సురేష్, తమన్నాతో కలిసి తనదైన స్టెప్పులతో చిరు అదరగొట్టారు.
ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ జూన్ 24న విడుదలై అభిమానులను ఆకట్టుకుంది.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించింది. ఆగస్టు 11న భోళా శంకర్ సినిమా విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మెహర్ రమేష్ ట్వీట్
Let your spirit soar high with the grand celebration anthem from @AKentsOfficial
— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) July 9, 2023
Megastar #BholaaShankar 🔱#JamJamJajjanaka Song Promo out now ❤️
Full Song on 11th JULY💥
- https://t.co/rFipc0SOjn@SagarMahati thumping musical 🥁 @LyricsShyam 🖊️
MEGA🌟@KChiruTweets… pic.twitter.com/seQYfMVJn6