భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ
నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత తెలుగులో మళ్లీ డిటెక్టివ్ మూవీ రాలేదు. డిటెక్టివ్ సినిమాలకు అభిమానులు ఎప్పుడూ ఉంటారు. సినిమా బాగుంటే వాళ్ళు దాన్ని తమ భుజాల మీద మోస్తారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ విషయంలో అలానే జరిగింది. ప్రస్తుతం తెలుగు తెర మీద మరో డిటెక్టివ్ మూవీ కనిపించనుంది. శివ కందుకూరి హీరోగా "భూతద్దం భాస్కర్ నారాయణ" పేరుతో సినిమా రూపొందుతోంది. ఈ మేరకు ఈరోజు టీజర్ ని కూడా వదిలారు. టీజర్ మొదట్లోనే ఒక సీరియల్ కిల్లర్ గురించి చెబుతారు. 16మందిని చంపి వారి తలలను తీసుకెళ్ళిన కిల్లర్ ని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది. అప్పుడే హీరో రంగంలోకి దిగుతాడు.
ట్రైలర్ లో కనిపిస్తున్న పురాణాల వాసనలు
ఆ సీరియల్ కిల్లర్ ని హీరో పట్టుకున్నాడా లేదా అనేది తెరమీద కనిపించనుందని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. శివ కందుకూరి ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు. డిటెక్టివ్ పాత్రకు శివ కందుకూరి సరిగ్గా సరిపోయినట్లు కనిపిస్తుంది. పూర్తి టీజర్ మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సస్పెన్స్ సన్నివేశాలు చాలానే ఉన్నట్లున్నాయి. టీజర్ లో వినిపించిన నేపథ్య సంగీతం, సినిమా మీద ఇంట్రెస్ట్ ని మరింత పెంచింది. సినిమాలో పురాణాల గురించి ఉన్నట్లు టీజర్ లో కొన్ని షాట్స్ కనిపించాయి. ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ్ సారంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గనిన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మార్చ్ 31వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.