Page Loader
బిగ్‌బాస్ శివాజీ 90's వెబ్‌సిరీస్ ముహుర్తం ఖరారు.. ఆ ఛానెల్లోనే స్ట్రీమింగ్
బిగ్‌బాస్ శివాజీ 90's వెబ్‌సిరీస్ ముహుర్తం ఖరారు.. ఆ ఛానెల్లోనే స్ట్రీమింగ్

బిగ్‌బాస్ శివాజీ 90's వెబ్‌సిరీస్ ముహుర్తం ఖరారు.. ఆ ఛానెల్లోనే స్ట్రీమింగ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 25, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్‌ బాస్ 7 కంటెస్టెంట్‌ శివాజీ త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ మేరకు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. 90's పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్ కానుంది. దీపావ‌ళి సందర్బంగా ఈ వెబ్‌సిరీస్‌ను విడుదల చేయ‌నున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ ప్రకటన చేసింది. ఇందులో శివాజీ శేఖ‌ర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాత్ర‌లో కనువిందు చేయనున్నాడు. ఈ మేరకు మిడిల్ క్లాస్ కుటుంబాల్లోని ఆప్యాయ‌త‌ల‌ు, మమతానురాగాలకు ఈ వెబ్‌సిరీస్‌ అద్ధంప‌డుతుంది. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ తెలుగు వెబ్‌సిరీస్ లో తొలిప్రేమ ఫేమ్ వాసుకి కీల‌క పాత్ర‌లో నటిస్తుండటం విశేషం.

details

మధ్యతరగతి వెబ్‌సిరీస్ నేపథ్యంలో అలరించనున్న శివాజీ, వాసుకి

ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెల్లెలిగా న‌టించిన వాసుకి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అన్నీ మంచిశ‌కున‌ములే చిత్రంలో టాలీవుడ్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్‌సిరీస్ ద్వారా శివాజీ సహా వాసుకి ఓటీటీలోకి ప్రవేశించనున్నారు. ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 90's వెబ్‌సిరీస్‌ రూపుదిద్దుకుంటోంది. రాజ‌శేఖ‌ర్ మేడారం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2016లో విడుదలైన సీసా త‌ర్వాత శివాజీ సినిమాల‌కు దూర‌ంగా ఉన్నారు. తాజా వెబ్‌సిరీస్ ద్వారా శివాజీ న‌టుడిగా మరో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు బిగ్‌బాస్ క్రేజ్, 90's వెబ్‌సిరీస్‌కు కొంత వ‌ర‌కు క‌లిసిరానుంది. 90's వెబ్‌సిరీస్‌కు సురేష్ బొబ్బ‌లి సంగీతం అందిస్తున్నారు.