LOADING...
The Great Pre-Wedding : చిన్న సినిమాకి పెద్ద గౌరవం.. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'కు రెండు అవార్డులు
చిన్న సినిమాకి పెద్ద గౌరవం.. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'కు రెండు అవార్డులు

The Great Pre-Wedding : చిన్న సినిమాకి పెద్ద గౌరవం.. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'కు రెండు అవార్డులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025లో విడుదలైన కామెడీ డ్రామా సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 7 పి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందీప్ అగరం నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కుటుంబ నేపథ్యంలో సాగే వినోదాత్మక కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్ కీలక పాత్ర పోషించారు. గతేడాది నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా, పల్లెటూరి నేపథ్యం, హాస్యభరిత కథనం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 సంవత్సరానికి చెందిన ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దార్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ చిత్రానికి రెండు విభాగాల్లో అవార్డులు లభించాయి.

వివరాలు

మాస్టర్ రోహన్ రాయ్‌కు 'బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్' అవార్డు

'థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్' అవార్డుతో పాటు, సినిమాలో తన నటనతో మెప్పించిన మాస్టర్ రోహన్ రాయ్‌కు 'బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్' అవార్డు దక్కింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు గద్దర్ అవార్డుల్లో రెండు పురస్కారాలు గెలుచుకోవడంతో మరింత గుర్తింపు పొందింది. చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకులను 'ది గ్రేట్' అనిపించుకున్న ఈ చిత్రం, ఇప్పుడు అవార్డులతో మరో మెట్టు ఎక్కింది. నిర్మాత సందీప్ అగరం ఆనందం వ్యక్తం చేస్తూ, "ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది 7 పి.ఎం.ప్రొడక్షన్స్ నుంచి మరో రెండు సినిమాలు రానున్నాయి. అలాగే ఒక తమిళ హీరోతో మరో సినిమా చర్చల దశలో ఉందని తెలిపారు.

Advertisement