Jai Hanuman: 'జై హనుమాన్' కోసం భారీ ప్లాన్స్.. టెక్నికల్ టీమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న సినిమాగా ప్రారంభమై పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన హనుమాన్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న జై హనుమాన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు వేగంగా పనులు సాగిస్తున్నారు. 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో కీలక భాగంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఫిబ్రవరిలో కర్ణాటకలోని అంజనాద్రి బెట్ట వద్ద ఈ చిత్రానికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం చిత్రీకరణ సైలెంట్‌గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది.
వివరాలు
హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి
ఈ సీక్వెల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించడం. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అలాగే రానా దగ్గుపాటి కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. మొదటి భాగంలో హీరోగా మెప్పించిన తేజా సజ్జా ఈ సీక్వెల్‌లోనూ కొనసాగనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టెక్నికల్ టీమ్‌లో జరిగిన మార్పులు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. 'హనుమాన్'కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన శివేంద్ర దాశరథి స్థానంలో, ఈసారి నిమిష్ రవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల 'లక్కీ భాస్కర్'తో తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఈ ప్రాజెక్ట్‌కు కొత్త విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని భావిస్తున్నారు.
వివరాలు
ఐదు బాషల్లో రిలీజ్
సంగీత విభాగంలో కూడా కీలక మార్పు చోటుచేసుకుంది. మొదటి భాగానికి గౌర హరి సంగీతం అందించగా, ఈసారి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం. కీరవాణి రంగంలోకి దిగారు. ఆయన సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని యూనిట్ నమ్ముతోంది. 2 'హనుమాన్' చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చిన్న చిత్రంగా ప్రారంభమై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. అదేస్థాయిలో అంతకంటే భారీగా 'జై హనుమాన్'ను తెరకెక్కించేందుకు ప్రశాంత్ వర్మ పెద్ద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది.