Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు బిగ్ షాక్.. నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరులోని కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే పేరుతో నాలుగు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులు పొందారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్-బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దిలీప్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో నాలుగు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉన్నారని ఆరోపిస్తూ ఆయన బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. బెంగళూరులోని 48వ ఏసీజేఎం కోర్టు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించాయి. ఈకేసులో ఇప్పటికే రెండుసార్లు కోర్టు సమన్లు జారీ చేసినా ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కాలేదు.
వివరాలు
మూడోసారి నాన్-బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
అనంతరం వరుసగా రెండుసార్లు నాన్-బైలబుల్ వారెంట్లు జారీ చేసినా స్పందన లేకపోవడంతో, తాజాగా కోర్టు మూడోసారి ఆయనపై నాన్-బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వ్యక్తిగతంగా వివాదాలు ఎదుర్కొంటున్నప్పటికీ సినీ కెరీర్‌లో మాత్రం ప్రకాష్ రాజ్ బిజీగానే కొనసాగుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దృశ్యం 3 చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తన షూటింగ్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మరికొన్ని చిత్రాల్లో కూడా ఆయన నటిస్తున్నారని సమాచారం. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ప్రకాష్ రాజ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.