LOADING...
Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తేదీ లాక్!
సూర్య ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తేదీ లాక్!

Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తేదీ లాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'కంగువా' తర్వాత ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్. ఇక 'సార్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ కాంబినేషన్ కారణంగా సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌పై ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్‌కు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. రాబోయే 10 రోజుల్లో ఈ టీజర్‌ను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన

అయితే టీజర్‌ను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా థియేటర్లలో కూడా భారీ స్థాయిలో ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుండగా, అదే రోజున సితార్ ఎంటర్ టైన్స్‌మెంట్ నిర్మించిన ధురంధర్ 2 కూడా థియోటర్‌లోకి రానుంది. ఈ రెండు సినిమాల ప్రదర్శన సమయంలో థియేటర్లలోనే సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్‌ను స్క్రీన్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అంటే మార్చి 19న సినిమా ప్రేమికులకు థియేటర్లలో నిజంగా పండగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

Advertisement