Irumudi: రవితేజ 'ఇరుముడి'లో బిగ్ ట్విస్ట్.. కీలక పాత్రలో సీనియర్ నటి!
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఇరుముడి' ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని జి. వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. అలాగే క్రేజీ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నకాస్త్ర ఈ చిత్రంలో రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు, సీనియర్ హీరోయిన్ శోభన పోషించే భావోద్వేగ పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.
వివరాలు
అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్లాసికల్ డాన్సర్ అయిన శోభన ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కథలో ఒక భావోద్వేగ ఆధారంగా నిలిచి, మొత్తం సినిమాకు ఎమోషనల్ బలాన్ని ఇవ్వనుందని టాక్. ముఖ్యంగా రవితేజ, శోభన పాత్రల మధ్య ఉండే అనుబంధం, వారి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయని చిత్రబృందం వర్గాలు చెబుతున్నాయి. 'మజ్ను', 'నిన్ను కోరి' వంటి భావోద్వేగ హిట్స్ ఇచ్చిన శివ నిర్వాణ, ఈ చిత్రంలో కూడా కుటుంబ బంధాలను హృదయానికి హత్తుకునేలా చూపించనున్నారని సమాచారం. రవితేజ ఇప్పటికే స్పందిస్తూ, "కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి, 'ఇరుముడి' అలాంటి కథే" అని తెలిపారు.