Rashmika: అల్లు అర్జున్-రష్మిక కాంబోలో బిగ్ ట్విస్ట్.. ఈసారి ప్రేమ కాదు పోరాటమే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం AA22xA6 దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ పని చేయడం విశేషం. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ కారణంగా మొదటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా ఖరారవ్వడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
Details
రెండు విభిన్న పాత్రలో అల్లు అర్జున్
అంతేకాదు, ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడన్న ప్రచారం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముంబయిలో కొనసాగుతున్న కొత్త షెడ్యూల్‌లో రష్మికతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రష్మిక పాత్రకు విలన్ ఛాయలు ఉండనున్నాయనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. కథలో కీలక మలుపులు తిప్పే పాత్రలో ఆమె కనిపించనున్నారనే ప్రచారం సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది.
Details
కీలక పాత్రలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్
అల్లు అర్జున్-రష్మిక మందానా కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనే ముద్ర ఉంది. 'పుష్ప: ది రైజ్', 'పుష్ప 2: ది రూల్' చిత్రాల్లో ఈ జోడీ సంచలన విజయాలు నమోదు చేసింది. అలాంటి హిట్ పెయిర్ మళ్లీ కలిసి నటించడం ఒక విశేషమైతే, ఈసారి రష్మిక హీరోకు ప్రతినాయకురాలిగా కనిపించనుందన్న వార్త మరింత ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు రొమాంటిక్ జంటగా అలరించిన ఈ ఇద్దరూ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కోణంలో కనిపించనున్నారనే టాక్ అభిమానుల్లో కొత్త ఉత్కంఠను రేపుతోంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
Details
ముంబయి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు
అలాగే రమ్యకృష్ణ, యోగి బాబు, జిమ్ సర్భ్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్లు సమాచారం. దాదాపు నెల రోజుల పాటు కొనసాగనున్న ముంబయి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు, కథకు కీలక మలుపులు తిప్పే ఎపిసోడ్‌లను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.