తదుపరి వార్తా కథనం
OG: 'ఓజీ' నుంచి బిగ్ అప్డేట్.. పవర్‌ఫుల్ లిరికల్ వీడియో విడుదల!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 02, 2025
02:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఓజీ' (OG) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పవన్ సరసన ప్రియాంకా మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల చిత్రబృందం ఓ శక్తివంతమైన పాటను విడుదల చేసింది. "OG Fire Storm Song" పేరిట వచ్చిన ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం అభిమానుల్లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.
Details
సోషల్ మీడియాలో సాంగ్ వైరల్
ఈ పాటలోని లిరిక్స్ ఆకట్టుకుంటుండగా, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ అప్పీల్‌కి తగిన విధంగా కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిత్రబృందం ఈ సాంగ్ ద్వారా సినిమా మీద హైప్‌ను మరింత పెంచింది.