Perfume Title Song : పర్‌ఫ్యూమ్ సాంగ్ విడుదల చేసిన భోలే షావలి
వరుస విజయాల మీద ఉన్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తాజాగా తన కొత్త సినిమా టైటిల్ సాంగ్'ను రిలీజ్ చేశారు. ఈ మేరకు బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ భోలే షావలితో కలిసి పర్‌ఫ్యూమ్ సినిమా టైటిల్ సాంగ్'ను విడుదల చేశారు. మ్యాడ్ సినిమాతో మంచి విజయం అందుకున్న భీమ్స్ అంతకు ముందు 'బలగం', 'ధమాకా' వంటి సినిమాలకు సూపర్ డూపర్ హిట్ పాటలు అందించారు. ఈ మధ్యే ఓ చిన్న సినిమా, పర్‌ఫ్యూమ్ (Perfume) కోసం ఆయన టైటిల్ సాంగ్ సైతం కంపోజ్ చేశారు. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన 'పర్‌ఫ్యూమ్ సినిమాలో జీడీ స్వామి దర్శకత్వం వహించారు.
టైటిల్ సాంగ్'కు మాత్రం భీమ్స్ సిసిరోలియో సంగీతం
శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ సంస్థలు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. నవంబర్ 24న క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ క్రమంలోనే సినిమా టైటిల్ సాంగ్'ను విడుదల చేశారు. 'పర్‌ఫ్యూమ్' సినిమాలోని అన్ని పాటలకు అజయ్ సంగీతం అందించారు. ఇదే సమయంలో ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. టైటిల్ సాంగ్'కు మాత్రం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడం విశేషం. గంగుల సురేష్ సాహిత్యం రాయగా, వరం, కీర్తనా శర్మ ఆలపించారు.