Biig Boss Telugu 10: 'బిగ్‌బాస్ 10'కు రంగం సిద్ధం.. అనౌన్స్‌మెంట్ వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్' మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని షో హోస్ట్, ప్రముఖ నటుడు నాగార్జున ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు. నాగార్జున చెప్పిన శక్తివంతమైన డైలాగ్‌తో వీడియో ప్రారంభమైంది. ''బిగ్‌బాస్ అనేది కేవలం ఎన్నో పోరాటాల్లో విజయం సాధించిన రాజ్యం మాత్రమే కాదు.. లక్షలాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్న ఒక మహా సామ్రాజ్యం'' అని ఆయన పేర్కొన్నారు. ఈవీడియో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ముఖ్యంగా బిగ్‌బాస్ థీమ్‌పై రూపొందించిన ప్రత్యేక గీతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాలు
మరింత ఉత్కంఠభరితంగా సీజన్..
అలాగే 'ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు' అనే ట్యాగ్‌లైన్‌తో ఈసారి సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో కొత్త సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. గత సీజన్‌లో ప్రముఖులతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఎన్నో దశల ఎంపిక ప్రక్రియను అధిగమించి ఆరుగురు సాధారణ వ్యక్తులు బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించి తమ ప్రతిభను చాటుకున్నారు. వారు సెలబ్రిటీ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ప్రేక్షకుల మన్ననలు కూడా పొందారు. ముఖ్యంగా కామన్‌మ్యాన్ కేటగిరీలో పాల్గొన్న కల్యాణ్ పడాల 'బిగ్‌బాస్ 9' విజేతగా నిలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.