బిగ్ బాస్ సీజన్ 7: బిగ్ బాస్ కి డబ్బింగ్ చెబుతున్నది ఎవరో తెలుసా?
తెలుగు టెలివిజన్ లో విజయవంతంగా దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2017లో మొదలైన బిగ్ బాస్ షో, ఇప్పటివరకు 6సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ ని మొదలుపెట్టింది. బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి అందరికీ ఒక సందేహం ఉంది. అసలు బిగ్ బాస్ఎవరు? హౌస్ లోని కంటెస్టెంట్లను కంట్రోల్ లో ఉంచే వాయిస్ ఎవరిదనేది తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం, బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలిసిపోయింది. బిగ్ బాస్ గా తన వాయిస్ తో షోని నడిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ అలియాన్ రేణుకుంట్ల శంకర్.
అమితాబ్ బచ్చన్ కు డబ్బింగ్ చెప్పిన శంకర్
బిగ్ బాస్ షోని తెలుగులో మొదలు పెట్టాలనుకున్నప్పుడు చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులను ఆడిషన్ ని పిలిచారట. వందల మందిలో నుండి రేణుకుంట్ల శంకర్ ఒక్కరే బిగ్ బాస్ నిర్వాహకులను మెప్పించగలిగారు. బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి ఇప్పటివరకు రేణుకుంట్ల శంకరే డబ్బింగ్ చెబుతున్నారు. రేణుకుంట్ల శంకర్ సినిమాలకు, సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రకు రేణుకుంట్ల శంకర్ డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు, సీఐడీ సీరియల్ తెలుగు వెర్షన్ కి శంకర్ వాయిస్ అందించేవారు. సినిమాల్లో విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు రేణుకుంట్ల శంకర్ డబ్బింగ్ చెబుతుంటారు.