తదుపరి వార్తా కథనం

కూతురు ఆరోగ్యంపై బిపాస బసు ఎమోషనల్.. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నట్లు వెల్లడి
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Aug 06, 2023
06:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు భావోద్వేగానికి గురయ్యారు. నటుడు కరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న బిపాస, ఇటీవలే పాపకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించి తాజాగా ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు.
పాప ఆరోగ్యం గురించి స్పందిస్తున్న క్రమంలో కన్నీటి పర్యంతమయ్యారు. 3 నెలల తర్వాత దేవికి గుండె ఆపరేషన్ చేయించామన్నారు. ఏ తల్లికీ ఇలాంటి దుస్థితి రావొద్దంటూ ఎమోషనల్ అయ్యారు.
చిన్నారి గుండెలో రంధ్రాలున్న సంగతి పుట్టిన మూడో రోజు డాక్టర్లు చెప్పారన్నారు. వీఎస్‌డీ (ventricular septal defect) గురించి తమకు అవగాహన లేదన్నారు.
ఆరు గంటలపాటు వైద్యులు సర్జరీ చేసి పాపను బ్రతికించారన్నారు. ఆ తర్వాత దాదాపు 40 రోజుల వరకు సరిగ్గా నిద్రపోలేదన్నారు.తమకు సహకరించిన తల్లులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.