Page Loader
Tillu Square: బ్లాక్ బస్టర్ 'టిల్లు స్క్వేర్' OTT విడుదల తేదీ లాక్
బ్లాక్ బస్టర్ 'టిల్లు స్క్వేర్' OTT విడుదల తేదీ లాక్

Tillu Square: బ్లాక్ బస్టర్ 'టిల్లు స్క్వేర్' OTT విడుదల తేదీ లాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2024
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లుపైగా వసూలు చేసింది. కాగా,ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.ఇప్పుడు,ఈ సినిమా తెలుగు, తమిళం,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో ఏప్రిల్ 26, 2024న విడుదల చేయనున్నట్లు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా స్శెట్టి (అతిథి పాత్ర), ప్రిన్స్ సెసిల్, ప్రియాంక జవాల్కర్ (అతిథి పాత్ర), బ్రహ్మాజీ, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్ ఫ్లిక్స్ చేసిన ట్వీట్