LOADING...
The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్!
'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్!

The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ప్యారడైజ్‌'. టైటిల్‌ టీజర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బలమైన ప్రతినాయకుడి పాత్రకు బాలీవుడ్‌ నటుడు రాఘవ్‌ జుయెల్‌ ఎంపికైనట్టు సమాచారం. ఇటీవల 'కిల్‌' అనే యాక్షన్‌ చిత్రంలో రాఘవ్‌ తన నటనతో ఆకట్టుకుని, ఆ చిత్రంలో చూపిన హావభావాలు, ఆహార్యంతో ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలకు బాగా నచ్చడంతో, 'ది ప్యారడైజ్‌'లో కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు తెలిసింది.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన

నానికి సరిపడే విరోధ పాత్రను పోషించగల నటుడిని ఎంపిక చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్షన్‌ డ్రామాలో ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉండేలా చిత్ర బృందం రచనలో కసరత్తు చేస్తోంది. అందుకే శ్రీకాంత్‌ ఓదెల సరైన నటీనటుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాఘవ్‌ జుయెల్‌ లుక్‌కి సంబంధించిన పోస్టర్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక కథానాయికగా 'కీర్తి సురేశ్‌'ను ఇప్పటికే చిత్ర బృందం ఖరారు చేసింది. నానికి తల్లిగా కనిపించే పాత్ర కోసం కూడా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరాఠీ నటి సోనాలి కులకర్ణి ఈ పాత్రకు దాదాపు ఫైనల్‌ అయినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.