John Abraham : ముంబైలో బంగ్లా కొన్న బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం.. ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ముంబై మహానగరంలో ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశారు. ఖార్‌లోని లింకింగ్ రోడ్‌లో సుమారు రూ.70.83 కోట్లు ఖర్చు చేశారు.
ఇందుకోసం జాన్ అబ్రహం రూ.4.24 కోట్ల స్టాంప్ డ్యూటీ సైతం చెల్లించారు. లింకింగ్ రోడ్‌లో ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈ బంగ్లాను కొనుగోలు చేసిన ఖార్ లింకింగ్ రోడ్ నివాస ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు చదరపు అడుగుకు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు ఉన్నాయి.
ఈ బంగ్లా 5416 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ఇదే సమయంలో మరో 7722 చదరపు అడుగుల స్థలం కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా డీల్ డిసెంబర్ 27, 2023న జరగడం గమనార్హం.
Details
ఇక్కడ అనేక విద్యా సంస్థలు ఉన్నాయి
బాలీవుడ్ పాత తరం తారలు ఇప్పటికీ ఇక్కడి ఖరీదైన బంగ్లాల్లో నివసించేందుకే ఇష్టపడుతుంటారు. అదనంగా ఈ ఏరియాలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి.
అయితే కొత్త తరం హీరోలు,హీరోయిన్లకు మాత్రం ముంబైలో విశాలమైన స్థలం లేకపోవడంతో ఎత్తైన అపార్ట్మెంట్లలో నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్'కు ముంబైలో చాలా బంగ్లాలే ఉన్నాయి. ఇటీవలే తన ప్రసిద్ధ బంగ్లాల్లో ఒకటైన ప్రతీక్షని తన కుమార్తె శ్వేతకు ఇవ్వడం గమనార్హం,
జుహులో ఉన్న ఈ బంగ్లా 890.47, 674 చదరపు మీటర్ల రెండు ప్లాట్లలో నిర్మించారు. ఈ ఆస్తికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ నవంబర్ 8న సంతకం చేసినట్లు తెలుస్తోంది.
ఈ లావాదేవీపై రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించడం కొసమెరుపు.