పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ హంగులు: అతిధి పాత్రలో నటించనున్న స్టార్ హీరో?
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, పుష్ప 2 సినిమా హైప్ ని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా నుండి మరొక క్రేజీ అప్డేట్ వచ్చింది. పుష్ప మొదటి భాగానికి బాలీవుడ్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 100కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాను బాలీవుడ్ జనాలకు మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, పుష్ప 2 సినిమాలో నటించబోతున్నాడని వినిపిస్తోంది.
పోలీస్ ఆఫీసర్ గా రణ్వీర్ సింగ్?
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పుష్ప 2 సినిమాలో రణ్వీర్ సింగ్ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ విషయమై చిత్ర బృందం నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ సోషల్ మీడియా సర్కిల్స్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే పుష్ప 2 సినిమాకు అదనపు మైలేజ్ వచ్చేసినట్టే. మొన్నటికి మొన్న పుష్ప 2 సెట్స్ నుంచి ఫాహద్ ఫాజిల్ ఫోటోను రిలీజ్ చేసింది చిత్రం బృందం. భన్వర్ సింగ్ షెకావత్ గా చేస్తున్న ఫాహద్ ఫాజిల్ పై కీలక ఎపిసోడ్ ని తెరకెక్కించారట. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 సినిమా, 2024 సంవత్సరం వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.