
పుష్ప 2 ద రూల్: ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్; ఫాహద్ ఫాజిల్ ఫోటో రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప 2 చిత్ర షూటింగ్ రాకెట్ స్పీడ్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పుష్ప గాడి రూలు సినిమా కోసం అభిమానులు ఎంతగాన్ఫ్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 నుండి అప్డేట్ వచ్చింది.
వేర్ ఈజ్ పుష్ప అనే మూడు నిమిషాల వీడియోలో హీరో అల్లు అర్జున్ ని తప్ప విలన్ గా చేసిన ఫాహద్ ఫాజిల్ కనిపించలేదు. ఈ విషయంలో ఫాహద్ అభిమానులు కొంత నిరాశ చెందిన మాట వాస్తవం.
ఇప్పుడా నిరాశను దూరం చేయడానికి, పుష్ప 2 షూటింగ్ నుండి ఫాహద్ ఫాజిల్ ఫోటోను రిలీజ్ చేసారు.
Details
ఫాహద్ ఫాజిల్ తో కీలక ఎపిసోడ్ పూర్తి
పోలీస్ యూనిఫామ్ లో కనిపిస్తున్న ఫాహద్ ఫాజిల్ కు మానిటర్ లో చూపిస్తూ సీన్ గురించి వివరిస్తున్నాడు సుకుమార్.
ఈ ఫోటోను రిలీజ్ చేసిన మేకర్స్, పుష్ప 2 సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర తాలూకు కీలక ఎపిసోడ్ పూర్తయ్యిందని, పగా, ప్రతీకారాలతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్ ని సినిమాలో చూస్తారని పోస్ట్ చేసారు.
ఈ ఫోటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫాహద్ అభిమానులకు మంచి ఊపునిచ్చింది. మొదటి పార్ట్ లో అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్.. ఇద్దరూ పోటాపోటీగా నటించారు.
సెకండ్ పార్ట్ లో వీళ్ళిద్దరి నటన పీక్స్ లో ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పుష్ప 2 సెట్స్ నుండి ఫాహద్ ఫాజిల్ ఫోటో రిలీజ్
A key schedule of #Pushpa2TheRule completed with 'Bhanwar Singh Shekhawat' aka #FahadhFaasil 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) May 18, 2023
This time he will return with vengeance ❤️🔥🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie @TSeries pic.twitter.com/l4lixpvhm7