LOADING...
Akhanda Roxx: మాస్ ఫ్యాన్స్ కోసం బోయపాటి స్పెషల్ ట్రీట్.. బాలకృష్ణ ఇమేజ్‌కు ప్రత్యేక వాహనం!
మాస్ ఫ్యాన్స్ కోసం బోయపాటి స్పెషల్.. బాలకృష్ణ ఇమేజ్‌కు ప్రత్యేక వాహనం!

Akhanda Roxx: మాస్ ఫ్యాన్స్ కోసం బోయపాటి స్పెషల్ ట్రీట్.. బాలకృష్ణ ఇమేజ్‌కు ప్రత్యేక వాహనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను-నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలిసి పని చేస్తే బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయమని అభిమానులు నమ్ముతారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలవగా, తాజాగా రాబోతున్న 'అఖండ 2'పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిసెంబర్ 5న పాన్‌-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే... తాజాగా ఈ సినిమా నుంచి ఒక అద్భుతమైన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో బాలకృష్ణ పాత్ర కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనం 'Akhanda Roxx'ను చిత్రబృందం ఘనంగా ఆవిష్కరించింది.

Details

కథనానికి తగ్గట్టుగా ఈ ప్రత్యేక వాహనం

హైద‌రాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను తన కోర్ క్రియేటివ్ టీమ్‌తో కలిసి హాజరయ్యారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో రూపొందించిన ఈ వాహనానికి, X Studios సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్‌, మాస్ ఎనర్జీ, హీరోయిజం అన్నీ కలగలిపినట్టుగా ఈ వాహనం డిజైన్ చేయబడింది. నందమూరి బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్‌కి అచ్చంగా సరిపోయేలా, కథనానికి తగ్గట్టుగా ఈ ప్రత్యేక వాహనం రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ఈ వాహనం డిజైన్‌పై తన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. "ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ స్క్రీన్‌పై కనిపించేటప్పుడు, దానికి తగ్గ ఆబ్జెక్ట్ ఉండాలి.

Details

అద్భుతమైన డిజైన్ తో తయారు

క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్ గా ఉంటుందో, ఈ వెహికిల్ కూడా అంతే పవర్ చూపిస్తుందని అన్నారు. ముఖ్యంగా, ఈ వాహనాన్ని అద్భుతంగా డిజైన్ చేసిన అమర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నాలుగు రోజుల పాటు పగలు-రాత్రి శ్రమించి ఈ అద్భుతమైన డిజైన్‌ను తయారు చేసినందుకు అమర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వాహనం వెండితెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారని, దీనిపై తనకు ఎంతో గర్వంగా ఉందని బోయపాటి చెప్పారు. అదనంగా 'అఖండ 2 కేవలం ఒక సినిమా మాత్రమే కాదు... ఇది భారతదేశపు ఆత్మ అని పేర్కొన్నారు. సినిమా చూసిన తరువాత ఈ మాటల నిజమైన అర్థం ప్రేక్షకులకి తెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement