Boyapati Srinu Next Film : బాహుబలి విలన్ తో బోయపాటి మూవీ? అభిమానుల్లో భారీ ఆసక్తి
ఈ వార్తాకథనం ఏంటి
గత ఏడాది విడుదలైన 'అఖండ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నినమోదు చేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్,ఎమోషన్,భక్తి అంశాలను సమతూకంగా మిళితం చేస్తూ తెరకెక్కిన ఈమూవీ మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఈకాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. సౌత్ ఇండియాలోనే కాకుండా హిందీ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ముంబయిలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాలు నార్త్ మార్కెట్‌లో సినిమాకు మరింత ప్రచారం తీసుకువచ్చాయి. బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలను ప్రత్యేకంగా హైలైట్ చేయడం కూడా సినిమాకు ప్లస్ అయింది.
వివరాలు
అందరి చూపు నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై
బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్స్, ఆయన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ నార్త్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్నాయి. దీంతో 'అఖండ 2' పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఈ విజయానంతరం ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను చేయబోయే తదుపరి సినిమా ఏదన్నదానిపై అందరిలో ఆసక్తి పెరిగింది. మాస్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి, తన చిత్రాల్లో హీరోను చాలా పవర్‌ఫుల్‌గా చూపించడం ద్వారా ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఆయన సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్ సీన్లు, భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అందుకే ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందన్న చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
వివరాలు
దగ్గుబాటి హీరోతో?
ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. 'బాహుబలి' చిత్రంలో విలన్‌గా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా ఇటీవల బోయపాటి శ్రీనును కలిశారనే ప్రచారం వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం,బోయపాటి -రానా కాంబినేషన్‌లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా రూపొందే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. రానా ఇప్పటికే తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రల్లో,గెస్ట్ అప్పియరెన్స్‌లలో కూడా నటిస్తూ తన నటనను చాటుకున్నారు. అలాగే వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ తన ప్రతిభను చూపిస్తున్నారు.ముఖ్యంగా 'బాహుబలి' చిత్రాల్లో భల్లాలదేవ పాత్రలో ఆయన చూపిన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.
వివరాలు
కటౌట్‌కు బాగా సూట్ అవుతుంది
శక్తివంతమైన శరీరాకృతి, గంభీరమైన స్వరం, ఇంటెన్స్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ రానాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇలాంటి రానా దగ్గుబాటిని బోయపాటి తన యాక్షన్ స్టైల్‌లో ఎలా చూపిస్తారో అనే ఆలోచనే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బోయపాటి సినిమాల్లో హీరో పాత్రకు సాధారణంగా బలమైన బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. రానా వంటి ప్రభావవంతమైన కటౌట్ ఉన్న నటుడికి ఈ తరహా కథలు బాగా సరిపోతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కేవలం చర్చల దశలోనే ఉందని సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కథా చర్చలు ప్రారంభమయ్యాయా లేదా కేవలం ఆలోచన స్థాయిలోనే ఉందా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
వివరాలు
హాట్ టాపిక్‌గా మారిన వార్త
రానా హీరోగా సినిమా వచ్చి చాలా కాలం కావడంతో, బోయపాటితో సినిమా ఫిక్స్ అయితే మాత్రం దగ్గుబాటి అభిమానులకు ఇది పెద్ద సంతోషకర వార్తగా మారే అవకాశం ఉంది. ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బోయపాటి-రానా కాంబినేషన్ నిజమైతే ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందే అవకాశం ఉంది. రానాకు ఇప్పటికే నార్త్ ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. మరోవైపు బోయపాటి యాక్షన్ స్టైల్‌కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి ఆదరణ పెరుగుతోంది. ఈ ఇద్దరూ కలిస్తే సినిమా భారీ స్థాయిలో తెరకెక్కే అవకాశముందని చెబుతున్నారు. అదేవిధంగా కథలో కూడా కొత్తదనం ఉండాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
హాట్ టాపిక్‌గా మారిన వార్త
'అఖండ 2' విజయంతో బోయపాటిపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ఆయన తదుపరి సినిమా ఆ అంచనాలను అందుకునేలా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. రానా వంటి నటుడితో పని చేస్తే కథలో కొత్త మలుపులు ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బోయపాటి - రానా కాంబినేషన్ గురించి వినిపిస్తున్న వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా అభిమానుల్లో మాత్రం భారీ ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే, ఇది ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మరి బోయపాటి తదుపరి సినిమా హీరోగా రానానే కనిపిస్తారా? లేక మరో స్టార్ హీరోతో ముందుకు వెళ్తారా? అన్నది త్వరలో తేలనుంది.