Page Loader
#BoyapatiRapo: పొలాల్లో మంచం మీద కూర్చుని రిలీజ్ డేట్ చెప్పేసిన రామ్ పోతినేని 
రామ్ పోతినేని, బోయపాటి కాంబో సినిమాకు కొత్త రిలీజ్ డేట్

#BoyapatiRapo: పొలాల్లో మంచం మీద కూర్చుని రిలీజ్ డేట్ చెప్పేసిన రామ్ పోతినేని 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 23, 2023
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. తాజాగా ఈ తేదీని కాదనుకుని, ప్రేక్షకులకు మరింత ముందుగానే వినోదం పంచాలని సెప్టెంబర్ 15వ తేదీన వస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా రిలీజ్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ రిలీజ్ పోస్టర్ లో రామ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. పొలాల్లో మంచం వేసుకుని, తెల్లచొక్కా, పట్టు పంచ కట్టుకుని చేతిలో కాఫీ కప్పుతో కనిపిస్తున్నాడు.

Details

అచ్చ తెలుగు రైతులా మెరిసిపోతున్న రామ్ 

ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లలో ఊరమాస్ గెటప్ లో కనిపించాడు రామ్. కానీ రిలీజ్ పోస్టర్ లో అచ్చ తెలుగు రైతులా మెరిసిపోతున్నాడు. రిలీజ్ తేదీని ప్రకటించారు గానీ సినిమా టైటిల్ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. రామ్, బోయపాటి కాంబో సినిమాకు ఎలాంటి టైటిల్ ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, థియేటర్లలో ఎలాంటి ఫలితం తెచ్చుకుంటుందో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామ్ పోతినేని, బోయపాటి కాంబో మూవీకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్