Brahma Anandam: 'బ్రహ్మా ఆనందం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం,అయన కుమారుడు రాజా గౌతమ్ తో తాత-మనవళ్లుగా నటించిన చిత్రం "బ్రహ్మా ఆనందం".
ఈ చిత్రానికి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. కుటుంబ కథాచిత్రంగా రూపొందిన ఈ సినిమా గత నెల 14న థియేటర్లలో విడుదలైంది.
బ్రహ్మానందం నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఓటీటీలో విడుదల
తాజాగా, ఈ సినిమా ఓటీటీ వేదికపై అందుబాటులోకి రానుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఆహా (Aha) లో మార్చి 14 నుంచి ప్రసారం కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
వివరాలు
కథా సారాంశం
బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఒక థియేటర్ ఆర్టిస్ట్. తన జీవిత లక్ష్యం గొప్ప నటుడిగా నిలదొక్కుకోవడం.
ఈ క్రమంలో, దిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో తన నాటకం ప్రదర్శించేందుకు అవకాశం వస్తుంది.
కానీ, ఆ ప్రదర్శనలో పాల్గొనాలంటే రూ. 6 లక్షలు చెల్లించాలని నిర్వాహకుడు బ్రహ్మను కోరతాడు.
అదే సమయంలో,బ్రహ్మ కు ఓ ఊహించని అవకాశం వస్తుంది.వృద్ధాశ్రమంలో ఉన్న తన తాత మూర్తి అలియాస్ ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం)తన పేరుపై కోదాడ దగ్గర ఆరు ఎకరాల భూమి ఉందని వెల్లడిస్తాడు.
వివరాలు
మార్చి 14 నుంచి ఆహా లో స్ట్రీమింగ్
అయితే, తన చెప్పిన విధంగా చేస్తేనే ఆ భూమిని బ్రహ్మకు అప్పజెప్పుతానని షరతు పెడతాడు.
అప్పుడు బ్రహ్మ తన తాతతో ఊరికి వెళ్లడం, అక్కడ ఎదురైన అనుభవాలు, మూర్తి అసలు ఉద్దేశ్యం ఏమిటి? అతను వృద్ధాశ్రమంలో ఎందుకు ఉంటున్నాడు? చివరకు బ్రహ్మ తన లక్ష్యాన్ని సాధించాడా? అన్న ఆసక్తికర మలుపులతో ఈ సినిమా రూపొందింది.
మార్చి 14 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టుగానే ఓటీటీ లో కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి!
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#BrahmaAnandam March 14th on #AhaVideo #RajaGoutham #Brahmanandam #VennelaKishore pic.twitter.com/mGn1DYen6p
— Television & Tollywood Updates (@TTUpdates360) March 13, 2025