LOADING...
Brahmanandam: శివాజీ కొడుకుకు బ్రహ్మానందం చెంపదెబ్బ.. వెంటనే గోల్డ్ రింగ్ గిఫ్ట్.. వీడియో వైర‌ల్
వెంటనే గోల్డ్ రింగ్ గిఫ్ట్.. వీడియో వైర‌ల్

Brahmanandam: శివాజీ కొడుకుకు బ్రహ్మానందం చెంపదెబ్బ.. వెంటనే గోల్డ్ రింగ్ గిఫ్ట్.. వీడియో వైర‌ల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమాల్లోనే కాదు, బయట స్టేజీలపైన కూడా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉండే నటుడు బ్రహ్మానందం. నవ్వులు పంచడం ఆయన ప్రత్యేకత. తాజాగా 'సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ హీరో శివాజీ కుమారుడికి స్టేజీపైనే చెంపపై సరదాగా తట్టడంతో పాటు, సినిమా అడ్వాన్స్‌గా బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు.

వివరాలు 

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని

శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం (మార్చి 3) రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేజీపై మాట్లాడేటప్పుడు ఆయన తన ప్రత్యేకమైన హాస్యంతో అందరినీ అలరించారు. "గ్లాసులు కడుక్కునే టైమ్‌లో ఎవరు ఉపన్యాసం వింటారు?" అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతున్న సమయంలో శివాజీ చిన్న కుమారుడు రిక్కీ కూడా స్టేజీపైనే ఉన్నాడు. అప్పుడే బ్రహ్మానందం,"నీ కొడుక్కి అడ్వాన్స్ ఇవ్వాలని ఉంది"అని శివాజీతో అన్నారు. దానికి శివాజీ "మీ ఇష్టం అన్నా"అని సమాధానం ఇచ్చారు.వెంటనే రిక్కీని దగ్గరకు రమ్మని బ్రహ్మానందం పిలిచారు.

వివరాలు 

చెంపపై తట్టిన బ్రహ్మీ

రిక్కీ దగ్గరకు రాగానే బ్రహ్మానందం అతని చెంపపై సరదాగా తట్టి, "మొదటి సినిమాకు అడ్వాన్స్ ఇస్తున్నాం" అని నవ్వుతూ చెప్పారు. అయితే అక్కడ ఉన్నవారు ఇప్పటికే అలీ అడ్వాన్స్ ఇచ్చాడని తెలిపారు. దీనిపై బ్రహ్మానందం, "డాలర్ నోట్ ఇక్కడ పనికిరాదు, ఇక్కడ రూపాయలే కావాలి" అంటూ మరోసారి హాస్యంగా వ్యాఖ్యానించారు. అప్పటికే అలీ తన పర్సులో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా, బ్రహ్మానందం తన చేతిలో ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి రిక్కీకి ఇచ్చారు. ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement

వివరాలు 

సినిమా వివరాలు

శివాజీ, లయ జంటగా నటించిన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. మొదట ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయాలని భావించారు. డిజిటల్ రిలీజ్ కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అయితే చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకొని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా మార్చి 6, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శివాజీ, లయతో పాటు బ్రహ్మానందం, అలీ, బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు.

Advertisement