తదుపరి వార్తా కథనం

గెట్ రెఢీ ఫర్ బ్రో మ్యూజిక్ అంటున్న థమన్..ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Jul 04, 2023
06:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తున్న బ్రో సినిమాకి సంబంధించి తాజా కబురు అందింది. ఈ మేరకు త్వరలోనే బ్రో మ్యూజికల్ బ్లాస్ట్ ప్రారంభం కానుందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెల్లడించాడు.
మరోవైపు తెలుగు ప్రేక్షకుల్లో, మెగా ఫ్యాన్స్ లో ఊపు తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు థమన్ పేర్కొన్నారు.
బ్రో ఫస్ట్ సింగిల్‌ను ఈ వారంలోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న బ్రో సినిమా, వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతోంది.
ఇప్పటికే రిలీజైన బ్రో టీజర్ నెట్టింట అలరిస్తోంది. ఈ నేపథ్యంలో జులై 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్రో మ్యూజిక్ స్టార్ట్ అంటున్న థమన్
The Month Of #BRO STARTS
— thaman S (@MusicThaman) July 3, 2023
Let’s make
This One the Best Guys 🔥♥️🎧🔊💥#Bro❤️🔥 LOADING 🔊🎧💃 pic.twitter.com/0mGmiLnxif