
బ్రో సినిమా రివ్యూ: మామా అల్లుళ్ళకు హిట్టు దొరికినట్టేనా?
ఈ వార్తాకథనం ఏంటి
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం తదితరులు
దర్శకత్వం: పి సముద్రఖని
కథనం, మాటలు: త్రివిక్రమ్
సంగీతం: థమన్
కథ:
మార్కాండేయులు అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) పాత్రకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళను జీవితంలో సెటిల్ చేయాలని, ఉద్యోగంలో ఎత్తుకు ఎదగాలని తపన పడుతూ కొంచెం కూడా టైమ్ వేస్ట్ చేయకుండా ఎప్పుడూ బిజీగా ఉంటాడు.
ఈ క్రమంలో ఒకసారి కార్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. అయితే అప్పుడే కాలం అనే దేవుడు (పవన్ కళ్యాణ్) ని కలుస్తాడు.
Details
మళ్ళీ బ్రతికే మార్క్ పాత్ర
తాను నెరవేర్చాల్సిన బాధ్యతల కోసం 90రోజులు కావాలని పవన్ పాత్ర దగ్గర పర్మిషన్ తీసుకుని భూమి మీదకు మార్క్ మళ్ళీ వస్తాడు. ఈ 90రోజుల్లో ఏం జరిగిందనేదే కథ.
సినిమా ఎలా ఉందంటే?
బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. పవన్ పాత్ర సినిమల్లోని పాటలను మెడ్లీలాగా వినిపించడం, ఆ పాటలకు పవన్ కళ్యాణ్ స్టెప్పులు వేయడం అభిమానులకు బాగా నచ్చుతుంది.
మొదటి భాగం మొత్తం వినోదాత్మకంగా హాయిగా ఉంటుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. పవన్ కళ్యాణ్ డైలాగుల్లో కొన్నిచోట్ల రాజకీయ అంశాలు కనిపిస్తాయి.
ప్రథమార్థం హాస్యంతో నింపేసి ద్వితీయార్థంలో భావోద్వేగాలతో నింపేసారు దర్శకుడు సముద్రఖని. క్లైమాక్స్ లో వచ్చె డైలాగులు గుండె లోతులను తాకుతాయి.
Details
ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్ ఎంట్రీ అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.
పాటలు పెద్దగా ప్రభావం చూపలేదు, కానీ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. హీరోయిన్ కేతికా శర్మ పాత్ర కొద్దిసేపే ఉంటుంది. బ్రహ్మానందం అతిథి పాత్రలో ఒకే ఒక్క సీన్ లో కనిపిస్తారు.
మైనస్ ల గురించి చెప్పుకోవాలంటే, పాటలు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఇంకా, ఒరిజినల్ సినిమాలో కనిపించినంత సంఘర్షణ రీమేక్ లో కనిపించకపోవడం. ఓవరాల్ గా చూసుకుంటే, బ్రో సినిమా బాగా ఆకట్టుకుంటుంది.