
Chiru-Pawan: తమ్ముడిని సర్‌ప్రైజ్ చేసిన అన్న.. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో చిరంజీవి సందడి!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు కీలక చిత్రాలు విడుదల దశలో ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న 'హరిహర వీరమల్లు' చిత్రం జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మధ్యే ఈ సినిమా ట్రైలర్ విడుదలపై కూడా మేకర్స్ గ్రాండ్ ప్లానింగ్ చేశారు. పవన్ నటించిన మరో యాక్షన్ డ్రామా 'ఓజీ' షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక పవన్ నటిస్తున్న మూడో చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
Details
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో
ఇందులో పవన్ కళ్యాణ్‌తో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర సెట్‌లో సోమవారం మెగాస్టార్ చిరంజీవి ఆకస్మికంగా సందర్శించడంతో షూటింగ్ వాతావరణం సందడిగా మారింది. చిరంజీవి స్వయంగా సెట్లో వచ్చి చిత్రీకరణను పరిశీలించగా, పవన్ కళ్యాణ్ పక్కన కనిపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో రియల్ లైఫ్ సంఘటనను రీక్రియేట్ చేయనున్నారు. ఒక సందర్భంలో పవన్ కారు రూఫ్‌పై కూర్చొని ప్రయాణించగా, అభిమానులు, సెక్యూరిటీ పటిష్ట ఏర్పాటుతో వెంబడించిన దృశ్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.
Details
ఆనందంలో పవన్ ఫ్యాన్స్
ఇప్పుడు అదే సీన్‌ను హరీష్ శంకర్ సినిమాలో మళ్లీ చూపించనున్నారని సమాచారం. ఈ సీన్ థియేటర్లలో అభిమానుల నుంచి విపరీతమైన స్పందన తెచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్క్రీన్‌ప్లేను దశరథ్ అందించగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఈ మూడు సినిమాలు పవన్ అభిమానులను ఎంతగానో రంజింపజేయనున్నట్లు స్పష్టమవుతోంది.