Loading...
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?

Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు బుచ్చిబాబు సాన తొలి సినిమా 'ఉప్పెన'తోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత రెండో సినిమాగా ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'పెద్ది' చిత్రాన్ని తెరకెక్కించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో బుచ్చిబాబుపై కొంత నెగిటివిటీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? మళ్లీ ఏ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు? బుచ్చికి ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు? అనే చర్చ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

వివరాలు

రెండో సినిమా కోసం నాలుగైదేళ్ల సమయం..

'ఉప్పెన' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తన రెండో సినిమా కోసం బుచ్చిబాబు దాదాపు నాలుగైదేళ్ల సమయం తీసుకున్నారు.

ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'ని తెరకెక్కించారు.

ఈ సినిమా తర్వాత మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన మూడో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని బుచ్చిబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

భారీ చిత్రం తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈసారి కథలో వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ADVERTISEMENT