LOADING...
Bunny Vas: 'ఎందుకిప్పుడు గొడవలు'.. బన్నీ వాసు పోస్ట్‌ నెట్టింట వైరల్ 
'ఎందుకిప్పుడు గొడవలు'.. బన్నీ వాసు పోస్ట్‌ నెట్టింట వైరల్

Bunny Vas: 'ఎందుకిప్పుడు గొడవలు'.. బన్నీ వాసు పోస్ట్‌ నెట్టింట వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అడపాదడపా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కనిపించే ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. "ఒక విషయం మీద గట్టిగా స్పందించాలి అనిపిస్తోంది. అదే సమయంలో, ఇప్పుడు ఎందుకు గొడవలు అని కూడా అనిపిస్తోంది. శాంతి.. శాంతి.. శాంతి..!" అంటూ ఆయన తన అసహనాన్ని పోస్టులో వ్యక్తపరిచారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లలో చర్చకు దారితీస్తున్నాయి. కొందరు ఇది 'సింగిల్' సినిమా వివాదాన్ని ఉద్దేశించిన వ్యాఖ్య అని అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

వివాదం నేపథ్యం: 

శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా, కేతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించిన చిత్రం 'సింగిల్‌' (Single) ఇటీవలే విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై, అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించారు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, దానిలోని ఓ డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ట్రైలర్‌లో శ్రీవిష్ణు "శివయ్యా" అనే డైలాగ్ చెబుతున్న దృశ్యం నెట్టింట వైరల్ కావడంతో, అది 'కన్నప్ప' చిత్రం మీద ట్రోల్‌ చేస్తున్నట్లుగా ఉందని కొంతమంది విమర్శించారు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్‌ పెరగడంతో, చిత్రబృందం అధికారికంగా స్పందించింది.

వివరాలు 

చిత్రబృందం స్పందన: 

"ఇటీవల విడుదలైన మా '#సింగిల్‌' ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.అయితే, అందులోని కొన్ని డైలాగ్స్ 'కన్నప్ప' టీమ్‌కు నిరాశ కలిగించాయని మాకు తెలిసింది.మేమది ఉద్దేశపూర్వకంగా చేయలేదు.కానీ,అది తప్పుడు దిశలో అర్థమైంది.అందుకే వెంటనే సంబంధిత సీన్స్‌ను ట్రైలర్‌ నుంచే తొలగించాం. సినిమాలోనూ అవి ఉండవు," అని స్పష్టం చేసింది చిత్ర యూనిట్.

వివరాలు 

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌తో బన్నీ వాసుకు సత్సంబంధాలు

అంతేకాక,"ఈ సినిమాలోని పలు సన్నివేశాలు,సోషల్ మీడియా ట్రెండింగ్ అంశాలు,ఇతర హీరోల సినిమాల్లోని రిఫరెన్సులుగా తీసుకున్నాం.ఎవరినైనా మనసు నొచ్చినట్లైతే మేము క్షమాపణలు చెబుతున్నాం.ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాం.చిత్రసీమలో ఉన్న మేమంతా ఒకే కుటుంబంలా ఉంటాం. ఒకరిని ఒకరు బాధ పెట్టుకోవాలనే ఉద్దేశం మాకెప్పటికీ లేదు," అని వారు పేర్కొన్నారు. ఈ సినిమా మే 9న విడుదల కాబోతోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌తో బన్నీ వాసుకు సత్సంబంధాలు ఉన్నవిషయం తెలిసిందే. అందుకే 'సింగిల్‌' వివాదంపై ఆయన పరోక్షంగా స్పందించినట్టుగా నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బన్నీ వాసు చేసిన ట్వీట్