Allu Arjun: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బన్నీ వాసు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా గురించి ఇటీవల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసినట్లు తెలిసింది.
'పుష్ప 2: ది రూల్' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత, 'గుంటూరుకారం' విడుదలకు ముందే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తాజాగా బన్నీ వాసు ఈ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
అతను తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి తన పాత్రను వెల్లడించాడు.
అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో తాను కీలకంగా వ్యవహరిస్తానని, కానీ ఎలాంటి సినిమా చేయాలో నిర్ణయం మాత్రం ఆయనే తీసుకుంటారని చెప్పారు.
త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన అప్డేట్‌లు అఫీషియల్‌గా ప్రకటిస్తామని, అధికారిక ప్రకటన రాకముందే ఈ సినిమా గురించి మాట్లాడలేనన్నారు.
Details
మార్చి నెలలో ప్రకటన చేయాలని ప్లాన్
మార్చి నెలలో దీనిపై ప్రకటన చేయాలని ప్లాన్ చేస్తున్నామని బన్నీ వాసు చెప్పారు.
ఈ సినిమాలో కీలకమైన సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో, "సంధ్య థియేటర్ తొక్కిసలాట" ఘటన తరువాత ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ బన్నీ వాసు ప్రకటన ప్రకారం, మార్చిలో అధికారిక అప్‌డేట్ ఇవ్వాలని నిర్ణయించారు.
స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.
హీరో పాత్ర బాడీ లాంగ్వేజ్ కోసం 3 నెలల సమయం పడుతుందని, సమ్మర్ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
Details
హిస్టారికల్ జోనర్‌లో తెరకెక్కుతున్న మూవీ
ఈ చిత్రానికి భారీ బడ్జెట్, వీఎఫ్ఎక్స్ స్పెషలిటీ ఉంటుందని పేర్కొన్నారు.
హరిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి పాన్ ఇండియా చిత్రం కానుందని, హిస్టారికల్ జోనర్‌లో అత్యంత భారీ స్కేల్ లో తెరకెక్కుతుందని, జోనర్ ఎస్.ఎస్ రాజమౌళి కూడా టచ్ చేయనట్లు తెలిసింది.
'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ తో ఈ చిత్రం మరింత భారీ అంచనాలు ఏర్పడినట్లు భావిస్తున్నారు.