Los angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. హాలీవుడ్ నటి సజీవదహనం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కొద్ది రోజులుగా కార్చిచ్చు భారీగా చెలరేగిపోయింది.
ఇప్పటికే భవంతులు, వేలాది ఎకరాలు కాలి బూడిదయ్యాయి. మరోవైపు కోట్లాది రూపాయల ఆస్తి ధ్వంసమైంది. ఈ మంటల్లో హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ (95) సజీవ దహనమైనట్లు ఆమె బంధువులు వెల్లడించారు.
ఆమె ఇంట్లో కాలిపోయిన అవశేషాలను అధికారులు గుర్తించారు. ది బ్లూస్ బ్రదర్స్, లేడీ సింగ్స్ ది బ్లూస్, ది టెన్ కమాండ్‌మెంట్స్, వంటి చిత్రాల్లో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
కాలిఫోర్నియాలోని అల్టాడెనాలోని ఆమె ఇంటి వద్ద ఆమె అవశేషాలు కనుగొన్నారు. డాలీస్ కర్రీ చివరిసారిగా జనవరి 7 సాయంత్రం కనిపించింది.
details
సంతాపం వ్యక్తం చేసిన అభిమానులు
ఆమె మనవరాలు డాలీస్ కెల్లీ ఆమెను ఇంటి దగ్గర దింపి, వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆమెను వెదికే ప్రయత్నం చేసినా ఆమె ఆచూకీ లభించలేదు.
చివరికి ఆమె మృతి చెందిందని డాలీస్ కెల్లీ జనవరి 12న సోషల్ మీడియాలో ప్రకటించారు.
డాలీస్ కర్రీ మృతిపై అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె సేవలను గుర్తుచేస్తున్నారు.