ఓ మై డార్లింగ్ మూవీ కోసం బుట్టబొమ్మ లిప్ కిస్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల తెలుగులో వచ్చిన బుట్టబొమ్మ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మళయాలంలో హిట్ అయిన కప్పెలా సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా.
అనికా సురేంద్రన్ ఇందులో హీరోయిన్ గా కనిపించింది. ఐతే గతంలో అనికా సురేంద్రన్ అజయ్ నటించిన విశ్వాసం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న నాగార్జున ఘోస్ట్ మూవీలో టీనేజ్ డాటర్ గా మెరిసింది.
ఇలా చిన్న చిన్న పాత్రలు వేస్తూ వస్తున్న అనికా సురేంద్రన్, సడెన్ గా ప్రేక్షకులకు షాకిచ్చింది. ఓ మై డార్లింగ్ అనే మళయాలం మూవీ ట్రైలర్ లో అనికాను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సినిమా
ముద్దులు, రొమాన్స్ తో రెచ్చిపోయిన అనికా సురేంద్రన్
18ఏళ్ల అనికా సురేంద్రన్, ఓ మై డార్లింగ్ ట్రైలర్ లో లిప్ కిస్ ఇస్తూ కనిపించడమే ఆ షాకింగ్ కి కారణం.
ఓ మై డార్లింగ్ ట్రైలర్ లో ముద్దు సీన్లు పుష్కలంగా కనిపించాయి. దాంతో అనికా ఇంకా చిన్నపిల్ల కాదని, అప్పుడే స్టార్ హీరోయిన్ ఛాయలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
కానీ కొందరు మాత్రం, 18ఏళ్ళ అమ్మాయి ఇవన్నీ ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదని, ఇంకా చాలా టిమ్ ఉందని సోషల్ మీడియా సాక్షిగా ఆమెకు సలాహాలు ఇస్తున్నారు.
యాష్ ట్రీ బ్యానర్ పై రూపొందుతున్న ఓ మై డార్లింగ్ సినిమాను మనోజ్ శ్రీకంఠ నిర్మిస్తున్నారు. అనికా సురేంద్రన్, మెల్విన్ జి బాబు హీరో హీరోయిన్లుగా కనిపిస్తుండగా, ఆల్ఫ్రెడ్ సామ్యూల్ దర్శకత్వం వహించారు.