
ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
నవంబర్ చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి.
మొదటి నుంచి కూడా దర్శకుడు కొరటాల శివ.. దేవర సినిమా తన బెస్ట్ కథ అవ్వబోతుందని వెల్లడి చేస్తూ వచ్చాడు.
అందుకు తగినట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్లను దేవర సినిమా కోసం కొరటాల శివ తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా దేవర సినిమా గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
Details
నీళ్ళలో యాక్షన్ ఎపిసోడ్
దేవర సినిమాలోని కీలక యాక్షన్ ఎపిసోడ్ పూర్తయిందని కెమెరామెన్ రత్నవేలు తెలియజేశారు.
నీళ్లలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయిపోయిందని, ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఆయన తెలియజేశారు.
దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది. సముద్రంలో జరిగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సీన్ కోసం, హైదరాబాద్ లో ఒకానొక స్టూడియోలో పెద్ద సెట్ వేశారట.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతుంది.