Loading...
Rahul Sipligunj: బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. అసలేం జరిగిందంటే?
బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. అసలేం జరిగిందంటే?

Rahul Sipligunj: బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. అసలేం జరిగిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ గాయకుడు, బిగ్‌ బాస్‌ తెలుగు విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. తన స్నేహితుడితో కొనసాగుతున్న వివాదంలో రాహుల్ సిప్లిగంజ్‌ కూడా జోక్యం చేసుకుని తనను బెదిరించారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాహుల్ సిప్లిగంజ్‌ స్నేహితుడు కర్పూరపు రాహుల్ రెడ్డి ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలున్నాయి. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి రాహుల్ రెడ్డిని నిలదీయడంతో.. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలను సోషల్‌ మీడియాలో విడుదల చేస్తానంటూ అతడు బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది.

వివరాలు

సీపీకి ఫిర్యాదు

ఈ నేపథ్యంలో సదరు యువతి మార్చి 10న విశాఖపట్నం సీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో రాహుల్ రెడ్డితో పాటు సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, మరికొందరిపై ఆమె ఫిర్యాదు చేసింది.

రాహుల్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని తాను ఒత్తిడి చేసిన సమయంలో.. రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరికొందరు తనను బెదిరించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఎంవీపీ పోలీసులు ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఎండాడ మహిళా పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వివరాలు

మరోవైపు మరో ఆరోపణ

అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి రాహుల్ రెడ్డిని రూ.1 కోటి డిమాండ్‌ చేసిందని, ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతోనే కావాలనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఇరువైపుల నుంచి వస్తున్న ఆరోపణలను పోలీసులు పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, మరోవైపు వినిపిస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ఏంటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ADVERTISEMENT