వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహాపై పోలీసు కేసు నమోదు
తెలుగు, తమిళం సినిమాల్లో విలన్ గా నటించే నటుడు బాబీ సింహాపై తాజాగా కేసు నమోదైంది. బాబీ సింహ లేటెస్ట్ గా తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రకాష్ రాజ్ తమ్ముడిగా కనిపించారు. తెలుగువాడైన బాబీ సింహా తమిళనాడులో కొడైకెనాల్ లో స్థిరపడ్డారు. తాజాగా కొడైకెనాల్ పోలీస్ స్టేషన్ లో బాబీ సింహాపై కేసు నమోదు అయింది. అసలేం జరిగింది? బాబీ సింహా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాడు. కొడైకెనాల్ విల్ పట్టి పంచాయతీ పరిధిలోని పేత్తుపారై ఊరిలో పెద్ద బంగ్లా నిర్మిస్తున్నాడు. ఈ బంగ్లా నిర్మాణ పనులను జమీర్ అనే కాంట్రాక్టర్ కు బాబీ సింహా అప్పగించారు.
కేజీఎఫ్ విలన్ పైనా కేసు నమోదు
అయితే దాదాపు ఇంటి నిర్మాణం 90% పూర్తయిందని సమాచారం. కానీ కాంట్రాక్టర్ జమీర్ కు బాబీసింహా డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమీర్ బంధువు హుస్సేన్, బాబీ సింహాను డబ్బుల గురించి అడిగినట్లు సమాచారం. దాంతో బాబీ సింహా, కేజీఎఫ్ సినిమాలో విలన్ గా కనిపించిన రామచంద్రన్ రాజ్, ఇంకా మరో ఇద్దరు కలిసి హుస్సేన్ ని బెదిరించారట. ఈ గొడవలో తల దూర్చకూడదని తిట్టారట. అందుకే హుస్సేన్, బాబీసింహా, రామచంద్రన్ రాజ్ ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయిన నలుగురిపై కొడైకెనాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు.