
Dulquer Salmaan: దుల్కర్‌కు ఊహించని షాక్.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో వేఫేరర్ ఫిలిమ్స్‌పై వివాదం!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అద్భుతమైన నటనతో మలయాళం,తమిళం,తెలుగు,హిందీ ప్రేక్షకుల మనసులు గెలిచిన ఈ స్టార్ నటుడు నిర్మాతగా కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతని సొంత నిర్మాణ సంస్థ వేఫ్‌ఫేరర్ ఫిలిమ్స్(Wayfarer Films) ద్వారా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. కానీ ఇటీవల,దుల్కర్‌కు ఊహించని షాక్ తగిలింది.ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి వేఫ్‌ఫేరర్ ఫిలిమ్స్ కింద కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు అనే వ్యక్తి తనను సినిమాల్లో అవకాశం ఇస్తానని భ్రమతో వంచించి, లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని పేర్కొంది.
వివరాలు
కేసు నమోదు చేసిన ఎర్నాకుళం సౌత్ పోలీసులు
యువతి తెలిపిన ప్రకారం దినిల్ బాబు వేఫ్‌ఫేరర్ ఫిలిమ్స్ తరఫున పనిచేస్తున్నట్లుగా చెప్పి, ఒక రాబోయే సినిమాకు ఆడిషన్ నోటిఫికేషన్ ఇచ్చి, పనమ్పిల్లి నగర్ సమీపంలోని భవనానికి పిలిచాడు. అక్కడ ఆమెను గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులు చేయడానికి ప్రయత్నించాడని, సహకరించకపోతే మలయాళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకపోవచ్చని బెదిరించాడని ఫిర్యాదులో వెల్లడించింది. ఆమె వద్ద ఉన్న వాయిస్ మెసేజ్‌లు, చాట్ రికార్డులు కూడా పోలీసులకు అందజేసినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు దాఖలు అయిన వెంటనే ఎర్నాకుళం సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై వేఫ్‌ఫేరర్ ఫిలిమ్స్ అధికారికంగా స్పందించింది.
వివరాలు
దినిల్ బాబుపై అధికారిక ఫిర్యాదు దాఖలు
సంస్థ విడుదల చేసిన ప్రకటనలో,దినిల్ బాబుకు వారితో ఎలాంటి సంబంధం లేదని,సంస్థ నిర్మించిన ఏ చిత్రంలోనూ అతను పనిచేయలేదని స్పష్టం చేసింది. అతను కంపెనీ పేరును ఉపయోగించి తప్పుడు కాస్టింగ్ కాల్స్ నిర్వహించి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. అదనంగా,దినిల్ బాబుపై తేవర పోలీస్ స్టేషన్, FEFKA వద్ద అధికారిక ఫిర్యాదు దాఖలు చేశామని తెలిపారు. కంపెనీ అధికారిక కాస్టింగ్ కాల్స్ మాత్రమే వారి సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతాయి, ఇతర వ్యక్తులు లేదా నకిలీ ప్రొఫైళ్స్ నుండి వచ్చే ఆఫర్లను ఎవరికీ నమ్మవద్దని అభిమానులు, కళాకారులకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ వ్యక్తిగతంగా స్పందించలేదు. కానీ ఈ వివాదం మలయాళ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.