ఓజీ నుండి సడెన్ సర్ప్రైజ్: అప్డేట్ ఎప్పుడు ఉంటుందో పోస్టర్ తో చెప్పేసారు
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. దర్శకుడు సుజీత్, తాజాగా ఈ విషయమై ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ లో విలన్ గ్యాంగ్ అంతా నేలమీద పడిపోయి ఉన్నారు. వాళ్ళను కొట్టిన గ్యాంగ్ మొత్తం వెనక్కి వెళ్తున్నారు. ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్.
ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ని చాలా దూరం నుండి చూపించారు. చేతిలో గన్ పట్టుకుని వెళ్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ కనిపించారు.
అయితే ఈ ఫైట్ జరిగిన ప్రదేశం ఎక్కడో కూడా పోస్టర్ లో తెలియజేసారు. చర్చిగేట్ లండన్ లో జరిగిందని పోస్టర్ మీద రాసారు.
Details
సెప్టెంబర్ 2వ తేదీన రానున్న అప్డేట్
మరో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన సరికొత్త అప్డేట్ రానుందని తెలియజేసారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఓజీ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటివరకు ఓజీ నుండి పవన్ కళ్యాణ్ లుక్ ని విడుదల చేయలేదు. అలాగే టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు.
పై విషయాలపై క్లారిటీ ఇస్తూ గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
ఓజీ సినిమాలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.