LOADING...
Khaidi: 42 ఏళ్ల 'ఖైదీ' వేడుక.. స్పెషల్ వీడియోతో చిరంజీవి టీమ్ సర్‌ప్రైజ్!
42 ఏళ్ల 'ఖైదీ' వేడుక.. స్పెషల్ వీడియోతో చిరంజీవి టీమ్ సర్‌ప్రైజ్!

Khaidi: 42 ఏళ్ల 'ఖైదీ' వేడుక.. స్పెషల్ వీడియోతో చిరంజీవి టీమ్ సర్‌ప్రైజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో మలుపుతిప్పిన మైలురాయిగా, తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'ఖైదీ' విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయ్యాయి. 1983 అక్టోబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అద్భుత చిత్రం, చిరంజీవి కెరీర్‌ను మరో ఎత్తుకు చేర్చిన గేమ్‌ ఛేంజర్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రత్యేక సందర్భంలో చిరంజీవి టీమ్ విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకువచ్చిన పేరు ఖైదీ అనే మాటలతో ప్రారంభమైన ఆ వీడియో అభిమానులను మళ్లీ 1983 కాలానికి తీసుకెళ్లింది.

Details

 యాక్షన్ సినిమాల రూపురేఖలను మార్చేసిన సినిమా

'ఖైదీ' కేవలం ఓ భారీ బ్లాక్‌బస్టర్‌ మాత్రమే కాదు, టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల రూపురేఖలను మార్చేసిన సినిమా. ఈ చిత్రంతో చిరంజీవి మాస్ ఇమేజ్ మరింత బలపడింది. ఆయన స్టార్‌డమ్‌ కొత్త దశను అందుకుంది. ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు ఈ కథను రచయితలు సూపర్‌స్టార్ కృష్ణ కోసం రాశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరంజీవికి దక్కింది. దర్శకుడిగా మొదట కె. రాఘవేంద్రరావును అనుకున్నా, చివరికి ఎ. కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Details

రూ.25 లక్షల బడ్జెట్ తో చిత్రీకరణ

హాలీవుడ్ చిత్రం 'ఫస్ట్ బ్లడ్' (రాంబో) నుంచి ప్రేరణ పొంది, పరుచూరి బ్రదర్స్ రాసిన కథ, సంభాషణలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కి అద్భుతంగా సరిపోయాయి. షూటింగ్ మొదలైన తర్వాతే చిరంజీవి పూర్తి కథ విన్నప్పటికీ, రచయితలపై నమ్మకంతో పని కొనసాగించారు. సుమారు రూ. 25 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, విడుదలకు ముందే రూ. 70 లక్షల బిజినెస్‌తో అంచనాలను పెంచింది. విడుదల తర్వాత మాత్రం అన్ని అంచనాలను మించి దూసుకెళ్లి, సుమారు రూ. 4 కోట్ల వసూళ్లతో ఆ కాలంలో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Details

తన

ఈ చిత్రానికి చిరంజీవి రూ. 1.75 లక్షలు, దర్శకుడు కోదండరామిరెడ్డి రూ. 40 వేలు పారితోషికంగా పొందారు. 'ఖైదీ' 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో ఏకంగా 365 రోజులు ప్రదర్శించారు. విశేషమేమిటంటే, ఈ సినిమా 100 రోజుల వేడుకకు సూపర్‌స్టార్ కృష్ణ స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర విజయంతో చిరంజీవి టాలీవుడ్‌లో అగ్రస్థానానికి చేరుకోగా హిందీ రీమేక్‌లో జితేంద్ర హీరోగా నటించిన వెర్షన్ కూడా మంచి విజయాన్ని సాధించింది. తెలుగు సినిమాను కొత్త దారిలో నడిపిన 'ఖైదీ', చిరంజీవి స్టార్‌డమ్‌ను శాశ్వతంగా మార్చిన మైలురాయిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.