తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Vyuham: 'వ్యూహం'పై నిర్ణయం తీసుకొండి..సెన్సార్ బోర్డుకు తెలంగాణ హై కోర్టు హైకోర్టు కీలక ఆదేశాలు..!
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    Feb 05, 2024 
                    
                     05:57 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయ వివాదానికి దారితీసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ'వ్యూహం'పై ఫిబ్రవరి 9లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సెన్సార్ బోర్డును సోమవారం ఆదేశించింది. సినిమాను మరోసారి సమీక్షించి ఫిబ్రవరి 9లోగా నివేదికను కోర్టుకు సమర్పించాలని రివైజింగ్ కమిటీని కోర్టు ఆదేశించింది. సోమవారం డివిజన్ బెంచ్ ముందు ఈ అంశం విచారణకు రాగా,ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. మూడు వారాల్లోగా కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి బెంచ్ సెన్సార్ బోర్డును గతంలో కోరింది. జనవరి 22న,పొలిటికల్ థ్రిల్లర్‌కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ సస్పెన్షన్‌ను కోర్టు మూడు వారాల పాటు పొడిగించింది. సినిమాపై మరోసారి సమీక్షించాలని, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీని న్యాయమూర్తి ఆదేశించారు.