LOADING...
Murali Mohan : సినీ, రాజకీయ సేవలకు కేంద్రం గుర్తింపు.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందన ఇదే!
సినీ, రాజకీయ సేవలకు కేంద్రం గుర్తింపు.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందన ఇదే!

Murali Mohan : సినీ, రాజకీయ సేవలకు కేంద్రం గుర్తింపు.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందన ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన మాగంటి మురళీ మోహన్ ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సందేశాత్మక చిత్రాలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 'జగమే మాయ' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా సహాయ నటుడు, విలన్ పాత్రల్లోనూ రాణిస్తూ తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. నిర్మాతగా ఆయన స్థాపించిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్‌లో అనేక క్లాసిక్ చిత్రాలకు వేదికైంది. సామాజిక విలువలు, సందేశాత్మక అంశాలతో రూపొందిన సినిమాలను ప్రోత్సహించిన నిర్మాతగా మురళీ మోహన్ ప్రత్యేక స్థానం సంపాదించారు.

Details

గతంలో టీడీపీ ఎంపీగా గెలిచిన మురళీ మోహన్

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయన సేవా దృక్పథం కొనసాగింది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన మురళీ మోహన్, తన నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు ఎందరికో మేలు చేశాయి. మాగంటి మురళీ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం ఆయన మానవతా భావానికి నిదర్శనంగా నిలిచింది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినీ రంగంతో ఆయన అనుబంధం ఎప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘ కాలంగా పద్మ పురస్కారాల కోసం ఆయన పేరు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.

Details

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది

తాజాగా 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో మురళీ మోహన్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేస్తున్నారు. 'మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది' అని అంటున్నారు. దానికి నేను లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని చెప్పాను.

Advertisement

Details

ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు

అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఎదురు చూపుల తర్వాత దొరికినదానికి విలువ మరింత ఎక్కువగా ఉంటుంది. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఈ గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్రమోదీగారికి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగారికి, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిగారికి, చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. అవార్డు అందుకున్న తర్వాత వివరంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతాను. థ్యాంక్యూ అంటూ ఆయన ఓ వీడియో ద్వారా స్పందించారు.

Advertisement