Page Loader
'Chaari 111': వెన్నెల కిషోర్ హీరోగా 'చారి 111'.. ఫస్ట్ లుక్ రిలీజ్ 
'Chaari 111': వెన్నెల కిషోర్ హీరోగా 'చారి 111'.. ఫస్ట్ లుక్ రిలీజ్

'Chaari 111': వెన్నెల కిషోర్ హీరోగా 'చారి 111'.. ఫస్ట్ లుక్ రిలీజ్ 

వ్రాసిన వారు Stalin
Nov 14, 2023
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ టాప్ కమెడియన్లలో 'వెన్నెల' కిషోర్ ఒకరు. అయితే 'వెన్నెల' కిషోర్ హీరో 'చారి 111' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. 'చారి 111' ఫస్ట్ లుక్‌ని మేకర్స్ మంగళవారం విడుదల చేసారు. ఇందులో 'వెన్నెల' కిషోర్ పంకీ గూఢచారి పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ నగరం సంక్షోభంలో ఉన్నప్పుడు నగరాన్ని రక్షించే బాధ్యతలను తీసుకున్న గందరగోళ గూఢచారి చారి పాత్రలో కిషోర్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'మళ్ళీ మొదలయ్యింది' ఫేమ్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మించారు. ఈ చిత్రానికి సైమన్ కింగ్ సంగీతం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సినిమా ఫస్ట్ లుక్ ఇదే..