Loading...
Malvika Mohanan: 'మాస్టర్‌'లో విజయ్‌కు జోడీగా ఛాన్స్‌.. మాళవికకు త్రిష స్పెషల్‌ మెసేజ్‌!
'మాస్టర్‌'లో విజయ్‌కు జోడీగా ఛాన్స్‌.. మాళవికకు త్రిష స్పెషల్‌ మెసేజ్‌!

Malvika Mohanan: 'మాస్టర్‌'లో విజయ్‌కు జోడీగా ఛాన్స్‌.. మాళవికకు త్రిష స్పెషల్‌ మెసేజ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండస్ట్రీలో త్రిష లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని నటి మాళవిక మోహనన్‌ అన్నారు. కొత్తగా పరిశ్రమలోకి వచ్చే నటీనటులను ఆమె ఎంతో ప్రోత్సహిస్తారని తెలిపారు. 'సర్దార్‌ 2' ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాళవిక.. త్రిషతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పేట' సినిమాలో త్రిషతో కలిసి నటించిన అనుభవాలను పంచుకున్నారు. ''నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే 'పేట' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రజనీకాంత్‌ సినిమా కావడంతో చాలా ఆనందంగా అనిపించింది. అయితే అప్పటివరకు కమర్షియల్‌ సినిమా చేసిన అనుభవం లేకపోవడంతో కొంత కంగారుపడ్డాను. వారణాసిలో సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు త్రిషతో కలిసి కొన్ని కాంబినేషన్‌ సన్నివేశాల్లో నటించాను. అప్పుడే ఆమెతో పరిచయం ఏర్పడింది.

వివరాలు

ప్రోత్సహించే వ్యక్తులు తక్కువ మంది ఉంటారు

త్రిష నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ నన్ను భాగం చేసేవారు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది ఎవరి పని వారు చేసుకుని వెళ్లిపోతుంటారు.

కానీ త్రిష మాత్రం కొత్తవారిని కూడా ఎంతో ఆదరిస్తారు. అలా ఇతరులను ప్రోత్సహించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని మాళవిక మోహనన్‌ తెలిపారు.

ఆ తర్వాత విజయ్‌కు జోడీగా 'మాస్టర్‌' సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు కూడా త్రిష తనకు ప్రత్యేకంగా మెసేజ్‌ పంపినట్లు మాళవిక గుర్తుచేసుకున్నారు.

'మాస్టర్‌' లాంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నీకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అంటూ త్రిష నాకు మెసేజ్‌ చేశారు.

వివరాలు

సెప్టెంబర్ 10న రిలీజ్

అలా ఎదుటివారి విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి'' అని మాళవిక త్రిషపై ప్రశంసలు కురిపించారు.

తన కెరీర్‌ కీలక మలుపు తిరుగుతున్న సమయంలో త్రిష అందించిన ప్రోత్సాహం తనకు ఎంతో ప్రత్యేకమని మాళవిక పేర్కొన్నారు.

2021లో విడుదలైన 'మాస్టర్‌' ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇక మాళవిక మోహనన్‌ నటించిన తాజా చిత్రం 'సర్దార్‌ 2' సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT