Page Loader
Chandra Mohan: చంద్రమోహన్ అంత్యక్రియలు ఎవరు చేస్తున్నారో తెలుసా! 
Chandra Mohan: నేడు చంద్రమోహన్ అత్యక్రియలు.. ఎవరు చేస్తున్నారో తెలుసా!

Chandra Mohan: చంద్రమోహన్ అంత్యక్రియలు ఎవరు చేస్తున్నారో తెలుసా! 

వ్రాసిన వారు Stalin
Nov 13, 2023
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్ర మోహన్ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. చంద్రమోహన్ లింగధారులు కావడం వల్ల ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేయనున్నారు. చంద్రమోహన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరిలో అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారనే దానిపై కుటుంబంలో చర్చ జరగినట్లు సమాచారం. అయితే చివరగా చంద్రమోహన్ తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో చంద్రమోహన్‌ను కడసారి చూసేందుకు ఆయన శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు అంతిమ సంస్కాలకు తరలివెళ్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తమ్ముడు చేతుల మీదుగా అంత్యక్రియలు