Page Loader
Chandra mohan: లక్కీ హీరో.. చంద్రమోహన్‌తో నటిస్తే చాలు హీరోయిన్ స్టార్ మారాల్సిందే! 
Chandra mohan: లక్కీ హీరో.. చంద్రమోహన్‌తో నటిస్తే చాలు హీరోయిన్ స్టార్ మారాల్సిందే!

Chandra mohan: లక్కీ హీరో.. చంద్రమోహన్‌తో నటిస్తే చాలు హీరోయిన్ స్టార్ మారాల్సిందే! 

వ్రాసిన వారు Stalin
Nov 11, 2023
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో చంద్రమోహన్‌ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. క్యారెక్టర్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత చంద్రమోహన్‌ హీరోగా రాణించారు. చంద్రమోహన్‌ను అప్పట్లో లక్కీ హీరో అనే వారు. ఇప్పటి తరం ఆయన్ను కామెడియెన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే చూస్తుంది. ఆయన ఒకప్పుడు స్టార్ ఇమే‌జ్‌ ఉన్న నటుడు. చంద్రమోహన్‌‌తో నటించడానికి హీరోయిన్లు పోటీ పడేవారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కొత్త హీరోయిన్ చంద్రమోహన్ పక్కన హీరోయిన్‌గా చేసిందా.. ఆమె స్టార్ మారియినట్లే. అలా మొదటి సినిమా చంద్రమోహన్ పక్కన నటించి.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటారు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రమోహన్

చంద్రమోహన్‌తో నటించిన తర్వాతే వీరికి స్టార్‌డమ్

కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'సిరి సిరిమువ్వలు' చిత్రంలో చంద్రమోహన్ హీరోగా, జయప్రద కథానాయికగా ఎంపికైంది. అప్పటి వరకు జయప్రదకు అంతగా గుర్తింపు లేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత జయప్రద వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దివంగత నటి శ్రీదేవి తొలి మూవీ హీరో కూడా చంద్రమోహన్ కావడం గమనార్హం. '16 ఏళ్ల వయస్సులో' వీరద్దరూ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత శ్రీదేవి కెరీర్ జెట్ స్పీడ్‌లా దూసుకుపోయింది. అలాగే 'చంద్రమోహన్‌'తో అనుబంధం సినిమాలో నటించిన తర్వాత జయసుధ‌కు స్టార్‌డమ్‌ స్టేటస్ లభించింది. వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన "ప్రాణం ఖరీదు" సూపర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత జయసుధకు విస్తృతమైన గుర్తింపు లభించింది.

చంద్రమోహన్

విజయశాంతి కూడా.. 

టాలీవుడ్ లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి 1983లో వచ్చిన 'పెళ్లి చూపులు' సినిమాలో చంద్రమోహన్‌తో కలిసి నటించింది. ఈ సినిమా తర్వాత విజయశాంతి ఒక్కసారి లైమ్‌లైట్‌ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిఘటన విజయశాంతి కెరీర్‌లోనే ఒక మైలురాయి అని చెప్పాలి. సుహాసినితో పాటు అప్పట్లో కొత్తగా ఎవరు వచ్చినా.. చంద్రమోహన్‌తో పక్కన నటించేందుకు పోటీ పడేవారంటే అతిశయోక్తి కాదు. చంద్రమోహన్ ఇప్పటివరకు 932 సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకులను మెప్పించారు.