Chhaava: తెలుగులో 'ఛావా' హవా.. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయికి!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నుంచి ఇటీవల విడుదలైన 'ఛావా' మూవీ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణంలో మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తూ, భారీ కలెక్షన్లు రాబడుతోంది.
తాజాగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకుని మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
తెలుగు వెర్షన్‌కు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది.
Details
ఆంధ్ర, నైజాం వంటి నగరాల్లో 60శాతం ఆక్యుపెన్సీ
భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా 'ఛావా' సంచలన విజయం సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది.
ఆంధ్రా, నైజాంలో ప్రధాన నగరాల్లో 60శాతం శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ముఖ్యంగా రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్ మరింత పెరిగినట్లు సమాచారం. మొదటి రోజు 57K+ టికెట్లు బుక్ కాగా, రెండో రోజు 69K+ బుక్కింగ్స్ నమోదయ్యాయి.
ఈ ట్రెండ్ చూస్తుంటే, 'ఛావా' తెలుగు బాక్సాఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.